ముఖ్యమంత్రిచే వర్చువల్ గా ఇందుకూరుపేట మండలంలోని కొరుటూరులో 132/33 కె.వి విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం. సుమారు లక్ష మంది వినియోగదారులకు ప్రయోజనం. రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ అవసరాలకు, పరిశ్రమలకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కోవూరు శాసన సభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇందుకూరుపేట మండలం, కొరుటూరులో రూ. 32.98 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 132/33 కె.వి విద్యుత్ ఉపకేంద్రాన్ని నేడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించి ఆ ప్రాంత ప్రజలకు అందించనున్నారు. ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉన్న పరిశ్రమలు, వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో పారిశ్రామిక విద్యుత్ అవసరాలు అధిగమించేందుకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ కొరుటూరులో విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ఈ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కొరుటూరు ప్రాంత వినియోగదారులకు అందచేయనున్నారు. 1 X 31.5 ఎం.వి.ఏ + 1 X 16 ఎం.వి.ఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి, కల్లూరుపల్లి విద్యుత్ ఉపకేంద్రం నుండి 132 కేవీ లైనును కొరుటూరు విద్యుత్ ఉపకేంద్రానికి అనుసంధానించారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం వల్ల ఇందుకూరుపేట, టిపి గూడూరు మండలాలకు సంబంధించి కొత్తూరు, ఇందుకూరుపేట, నరసాపురం, కోడూరు, సౌత్ ఆములూరు, పోట్లపూడి, జగదేవిపేట, లేబూరు, కొమరిక, గంగపట్నంలకు చెందిన వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ లభించనుంది. దీనివల్ల వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించే సౌకర్యం సులభతరం అవడంతో పాటు విద్యుత్ లైన్ల పొడవు తగ్గడం వలన లోవోల్టేజీ సమస్య తగ్గి నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా కానుంది. ఇందుకూరుపేట, టిపిగూడూరు ప్రాంతాల ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఈ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం…..
నాణ్యమైన విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం- 132/33 కె.వి విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం.
236
previous post