చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజుల్లుతున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆదాయం కోసమే అభివృద్ధి చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉండడంతో అధికారుల తీరును పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్వామివారి ప్రచారం పేరుతో మునుపెన్నడూ లేని విధంగా వారణాసి, ఋషికేసి లాంటి అత్యధిక దూర ప్రాంతాలకు సైతం అధికారులు సతీ సమేతంగా వెళ్లి అక్కడ స్వామి వారి పూజా కార్యక్రమాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల రెండు కోట్ల లోపుగా ఆదాయం వచ్చే దేవాలయాల్లో కాణిపాకం దేవస్థానం ఒకటి.. ముఖ్యంగా ఐదు కోట్ల రూపాయల మేర భక్తుల నుంచి ఆదాయం సమకూరే శ్రీకాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, లాంటి ఆలయాల ఖర్చుతో పోల్చుకుంటే గత మూడు సంవత్సరాలుగా కాణిపాకం దేవస్థానానికి భారీగా ఖర్చును లెక్కల్లో చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు కోటి రూపాయల వరకు పాలకమండలి, ఉన్నత అధికారులు, దూర ప్రయాణాల పేరుతో ఖర్చులు అయ్యాయి అనేది అక్షర సత్యం… మరోవైపు దేవస్థాన అధికారులకు స్వామి వారి సొమ్మును ఖర్చు చేసే అధికారం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులకు సైతం యాత్రలకు తీసుకు వెళుతూ భారీగా భక్తుల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు సైతం భక్తులు అందజేస్తున్న విరాళాలు, వాటి ఖర్చు వివరాలను ప్రతి ఆలయం వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాణిపాక దేవస్థానం అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆలయ పునర్నిర్మాణ దశలో సైతం దాత అందజేసిన దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు, కుంభాభిషేక సమయంలో భక్తులు అందజేసిన లక్షల రూపాయల విరాళాలు, బంగారు (తాపడం) ధ్వజస్తంభం ఏర్పాటు కోసం భక్తులు విరాళాలను అందజేసిన లక్షల రూపాయలు వీటన్నిటికీ కూడా దేవస్థాన అధికారుల వద్ద లెక్కలు లేవు.. అంతేకాకుండా గత మూడు సంవత్సరాలుగా ఖర్చుల రూపేనా లక్షల రూపాయలు చూపుతున్న అధికారులు ఆదాయంగా వచ్చిన నిధులు ఏ మేర ఖర్చు పెట్టారు శ్వేత పత్రం విడుదల చేయాలని స్థానిక ఉభయదారుల వ్యవస్థ ప్రశ్నిస్తోంది…. అంతేకాకుండా కేవలం ధనార్జనే లక్ష్యంగా కాణిపాక ఆలయం వద్ద అభివృద్ధి పనులు సాగుతున్నాయి. 50 లక్షల రూపాయల వ్యయంతో వేసిన రోడ్డు సైతం మూడు నెలల్లోనే నిర్వీర్యం అయిపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు. కాణిపాక దేవస్థానం వద్ద నిధుల దుర్వినియోగం తో పాటు వడ్డించేవాడు మనవాడైతే అనే చందన వసతి గదులు, టెండర్లు, ప్రసాదాల విక్రయాలు, విరాళాల సేకరణ సైతం భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ స్వామి వారి సొమ్మును రక్షించి పొదుపు చేయాల్సిన అధికార యంత్రాంగం భారీగా ఖర్చు చేస్తున్నడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర స్థాయి అధికారులు కాణిపాక దేవస్థానం పై నిర్లక్ష్యం చూపడంతోనే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మరోవైపు బలంగా ఆరోపణలు ఉన్నాయి
కాణిపాక వినాయక దేవస్థానం అధికారులపై అవినీతి ఆరోపణలు..
53
previous post