తిరుపతి జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు ఐ ఎం డి నుండి సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణా రెడ్డి శనివారం తెలిపారు. ఐఎండి హెచ్చరికల ఆధారంగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మండల స్థాయి, గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని ప్రస్తుత సమాచారం మేరకు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు . అధికారులందరూ అప్రమత్తమై ఉన్నారని, ప్రజలందరూ అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ముఖ్యంగా 4,5 ఈ రెండు తేదీలలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వృద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులు అందరూ మునిసిపల్ ఏరియాలలో మరియు రూరల్ ఏరియాలలో రిహాబిలిటేషన్(పునరావాస కేంద్రాలు) సెంటర్లు ఏర్పాటు చేయడం జరగుతుందనీ, అలాగే ఈ సెంటర్లలో 24 గంటలు వసతి, ఫుడ్ మరియు ఇతర మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడిఎస్ ముఖ్యంగా 10 రోజుల లోపు డెలివరీ అయ్యే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హాస్పిటల్స్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లల తల్లులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని అందులో పిల్లలకు సంబంధించిన పాలు, ఆహారం వంటివి అందేలా చూస్తున్నామన్నారు. ప్రధానంగా దృష్టి గుడిసెలలో ఉన్నవారు, కచ్చా గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలని, ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులందరూ అప్రమత్తమై వున్నారని, ప్రజల నుంచి కూడా సహకారం కావాలని అందరిని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సలహాలను పాటిస్తూ ఉన్నట్లయితే ఈ తుఫానును సునాయాసంగా ఎదుర్కొనవచ్చునని తెలిపారు.
తిరుపతి జిల్లాకు తుఫాను ముప్పు…
60
previous post