లూటీ కోసమే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని, ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళుతోందని, నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా ప్రతిపక్షాలపై విరుచుకుపడడం తప్ప ఏమాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లెవేస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్, క్రిసిల్ లాంటి సంస్థలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ దాస్ తన నివేదికలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో ఏపీ 8వ స్థానం నుంచి 11వ స్థానానికి పడిపోయిందని చెప్పారన్నారు. క్రిసిల్ రేటింగ్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగ్‌ను తగ్గించిందని, చేబదుళ్లు, ఓవర్ డ్రాప్ట్‌లతోనే ఆర్థిక నిర్వాహణ చేసే స్థితికి దిగజారిందన్నారు. జగన్ రెడ్డి దోపిడీ, దుబారాల వల్లే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల సమాచారం కాగ్ అడిగినా ఆ లెక్కలు వెల్లడించడం లేదని మాజీ మంత్రి యనమల ఆరోపించారు.
లూటీ కోసమే మితిమీరిన అప్పులు – రామకృష్ణుడు
79
previous post