ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లోని మల్కనగిరి జిల్లాలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధి కూర్మాన్నూర్ పంచాయతీ గ్రామ అడవిలో జవాన్లు భారీ మావో డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. మల్కనగిరి ఎస్పీ కార్యా లయం వద్ద డంప్ లో స్వాధీనం చేసుకున్న సామగ్రిని ప్రదర్శించారు. ఈ డంపులో సుమారు 17 మంది పాత్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డంప్‌లో 15 కేజీల ఐఈడీ టిఫిన్ బాంబ్‌లు, మూడు కిలోల ఐఈడీ టిఫిన్ బాంబులు 2, ఎనిమిది కిలోల ఐఈడీ టిఫిన్ బాంబు 1, ఆరు కిలోల ఐఈడీ టిఫిన్ బాంబు 1, జిలెటిన్ స్టిక్స్ కట్టలు, డిటోనేటర్, చిన్న గ్యాస్ సిలెండర్, ఎలక్ట్రికల్ వైర్ 40 మీటర్లు, నాటు తుపాకీ, తుపాకీ గండ్లు ఉన్నాయి. ఈ డంప్ దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను ఎస్పీ నితీష్ వాద్వానీ అభినందించారు.
Read Also..