కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు, ముడనమ్మకాలతో(kakinada ghost news) భయ పడుతున్న గ్రామ ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు పోలీస్ అధికారులు, జన విజ్ఞాన వేదిక నాయకులు నడుంబిగించారు. ఇది ఎవరో కావాలని స్వప్రయోజనాల కోసం చేస్తున్న పని అని జన విజ్ఞాన వేదిక ఫ్యాక్ట్ చెక్ కమిటీ నిర్ధారించింది. గతనెల 29వ తేదీన గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించడం ఆ మరుసటి రోజు నుంచి ఓ వ్యక్తి ఊళ్ళో ఉన్న శివాలయం సమీపంలో కుర్చీని ఉన్నాడని….విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాడని గ్రామంలో పుకార్లు షికార్లు చేశాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
కాల బైరవ సహిత అష్ట దిగ్బంధన మహా చండి యాగం | kakinada ghost news:
దీంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర భాందోళనలకు గురయ్యారు. చీకటి పడితే ఒంటరిగా బయటకు వచ్చేందుకు కూడా ఎవరు సాహసించడం లేదు. ఆ శబ్దాలు చేస్తున్న వ్యక్తి కోసం రాత్రుళ్ళు గ్రామంలోని యువకులు విధుల్లో కర్రలు పట్టుకుని కాపలా ఉండేవారు. దీంతో గ్రామస్తుల్లో భయాన్ని పోగొట్టేందుకు అమావాస్య రోజు గ్రామ పెద్దలు, పురోహితుల ఆధ్వర్యంలో కాల బైరవ సహిత అష్ట దిగ్బంధన మహా చండి యాగం నిర్వహించారు.
అయితే చండి యాగం తర్వాత కూడా గ్రామ ప్రజల్లో భయలు తోలగకపోవడంతో పోలీసులు, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దయ్యాలు, భూతాలు అనేవి లేవని అదంతా మానవ సృష్టేనని జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రజలకు తెలిపారు. మూడ నమ్మకాలపై బుద్ధ శ్రీనివాసరావు మేజిక్ షో గ్రామస్తులను ఆకట్టుకుంది. దయ్యాలు,బుతాలు(ghost) అనేవే లేవని అవన్నీ అభూత కల్పనలేనని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భారత దేశం సాంకేతిక పరంగా ముందుకు దూసుకుపోతోందని కే. ఎం.ఎం.అర్.ప్రసాద్ అన్నారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని. గ్రామస్తులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న అసత్య ప్రచారాల వల్లే ప్రజల్లో భయం నెలకొందని ప్రజలను భయపెట్టే విధంగా చేసే అవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దాపురం సీఐ వై.రవి కుమార్ హెచ్చరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: ఊర్లో దెయ్యాలు ఉన్నాయి అంటూ వింత ప్రచారం…