కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులాదిన్నె దగ్గర 42 కోట్లతో నిర్మించిన రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే నాగులాదిన్నె వంతెన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నేకేశావా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, జిల్లా zp చైర్మన్ పాపి రెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు ప్రారంభించారు. అనంతరం మంత్రి బుగ్గనా మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను కలిపే ఈ నాగులాదిన్నె వంతెన, 2009 లో వచ్చిన వరదలో ఈ నాగులాదిన్నె వంతెన కూలిపోవడంతో రాకపోకలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చెన్నేకేశవ రెడ్డి పట్టుదలతో ఈ వంతెన పనులు త్వరగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ వంతెన పూర్తి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.
Read Also..