విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజి సర్కిల్ వద్ద ముగిసింది. బెంజి సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాగా, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్టయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
- పోలీసుల విచారణకు సజ్జల గైర్హాజరు( ) వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. ఈ రోజు ఉదయం 10.30…
- నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంసీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం . ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో చర్చించనున్నారు.…
- ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయంవైసీపీ హయంలో టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతోంది. తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.