రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడని టీడీపీ సీనియర్ నాయకుడు, విద్యావేత్త పెదరాసు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆయన మధ్యతరగతి కార్పొరేట్ స్కూళ్లు నిర్వహించాలంటే కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. ఎకానమీ కార్పొరేట్ స్కూల్లలో 2/3 వంతు పిల్లలు అడ్మిషన్లే తగ్గిపోయాయని వాపోయారు. జనాలను బానిస బతుకులకు అలవాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇదే కాకుండా కేంద్రీయ విద్యా వ్యవస్థ తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్లో నిర్వహణ కష్టతరంగా మారడానికి కారకుడుగా సీఎం జగన్ నిలిచాడని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్ల గత మూడు సంవత్సరాల్లో 8 వేల స్కూలు మూతపడ్డాయని, అప్పుల బాధతో కొన్ని వందల మంది కరస్పాండెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలు కూడా రాజ్యాంగబద్ధంగా రిక్రూట్మెంట్ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి మేల్కొని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సుబ్రహ్మణ్యం కోరారు. లేదంటే తెలంగాణలో మాదిరి ఆంధ్రాలో కూడా నిరుద్యోగ యువత అందరూ ఎదురుతిరిగి రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి మరో శిరీష అలియాస్ బర్రెలక్క స్థాయిలో పోటీ చేసి తగిన బుద్ధి చెబుతారని సుబ్రహ్మణ్యం హెచ్చరించారు
జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం – సుబ్రహ్మణ్యం
65