కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ భూమన మీడియాకు వెల్లడించారు.ముడిసరుకుల నిల్వకు అలిపిరి వద్ద రూ. 11 కోట్లతో గోడౌన ను నిర్మించనున్నట్లు తెలిపారు. మంగళం-రేణిగుంట రోడ్డుకు రూ. 15 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.పుదిపట్ల జంక్షన్-వకుళామాత గుడి వరకు రోడ్డుకు రూ. 21 కోట్లు కేటాయించామన్నారు.ఆయుర్వేద ఆసుపత్రిలో రూ. 1.65 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రుయాలో టీబీ రోగులకు రూ. 1.79 కోట్లతో కొత్త వార్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రూ. 197 కోట్లతో స్విమ్స్ నవీకరణ పనులు చేపడతామన్నారు. టీటీడీ ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. దీనికి కోసం మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నామని భూమన వెల్లడించారు.
టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం – భూమన
63
previous post