ముగిసిన సీఎం చంద్రబాబు 5 రోజుల జిల్లాల పర్యటన.

ముగిసిన సీఎం చంద్రబాబు 5 రోజుల జిల్లాల పర్యటన

Advertisements

<p>5 రోజుల జిల్లాల పర్యటనను ముగించుకొని అమరావతికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు&period; నాలుగు జిల్లాల్లో అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి&period;&period;ఇవాల్టి నుంచి పరిపాలనపై దృష్టి సారించనున్నారు&period; ఇవాళ RTGS&comma; ఎకనమిక్ రీజియన్లు అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ నెల 1à°¨ అమరావతి నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నెల్లూరు&comma; తిరుపతి&comma; కడప&comma; చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు&period; నెల్లూరు జిల్లా గూడూరులో &&num;8216&semi;పేదల సేవలో&&num;8217&semi; కార్యక్రమంలో పాల్గొని&comma; పింఛన్లు పంపిణీ చేశారు&period; జిల్లాలో మెగా ఫర్నిచర్ పార్కు ఏర్పాటు చేయనున్నామని&comma; వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు&period; అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఇక జూలై 2à°¨&comma; తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్&comma; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకం &&num;8216&semi;వీబీ జీ రామ్ జీ&&num;8217&semi;ని జాతీయ స్థాయిలో ప్రారంభించారు&period; అనంతరం తిరుపతిలో &&num;8216&semi;ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్&&num;8217&semi; వర్క్‌షాప్‌లో పాల్గొని&comma; డేటా ఆధారిత పాలన ప్రాముఖ్యతను వివరించారు&period;<&sol;p>&NewLine;<p>జూలై 3à°¨&comma; రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు&period; రూ&period;16&comma;350 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంటుతో పాటు&comma; అనుబంధంగా ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులనూ ప్రారంభించారు&period; ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా&comma; పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది&period;<&sol;p>&NewLine;<p>అనంతరం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు&period; &&num;8216&semi;స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక&&num;8217&semi; కార్యక్రమంలో భాగంగా రూ&period;9&comma;322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు&comma; శంకుస్థాపనలు&comma; ప్రారంభోత్సవాలు చేశారు&period; వీటిలో ప్రఖ్యాత అడిడాస్ ఫుట్‌వేర్ సంస్థ నుంచి విమానాల తయారీ ప్రాజెక్టు వరకు ఉన్నాయి&period; ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి&period; కుప్పంలో రూ&period;118 కోట్లతో మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు&comma; ఆరు దశాబ్దాల కంగుంది భూ సమస్యను పరిష్కరించి రైతులకు పట్టాలు పంపిణీ చేశారు&period; ఆసుపత్రిలో సీటీ స్కాన్&comma; డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు&period; చివరి రోజు పౌల్ట్రీ&comma; అభ్యుదయ రైతులతో ముఖాముఖి నిర్వహించారు&period; ఇక రాత్రి కుప్పంలోనే బస చేసిన సీఎం చంద్రబాబు&period;&period;ఇవాళ నేరుగా సచివాలయానికి చేరుకున్నారు&period; అక్కడ ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు విశాఖ&comma; అమరావతి&comma; తిరుపతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.