ఆర్టీజీఎస్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష.

ఆర్టీజీఎస్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష

Advertisements

<p>ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా&&num;8230&semi; రియల్‌టైమ్‌లో స్పందించే పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు&period; పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించడంతో పాటు&&num;8230&semi; రాష్ట్రవ్యాప్తంగా జీరో వేస్ట్ పట్టణాల లక్ష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు&period; సమస్యల పరిష్కారమే అధికారుల పనితీరుకు గీటురాయి అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఐదు రోజుల జిల్లా పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు&&num;8230&semi; సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు&period; ప్రజల సమస్యలపై ప్రభుత్వ స్పందన&comma; వివిధ శాఖల సేవలు&comma; పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం&comma; పట్టణ పరిశుభ్రత&comma; గంజాయి నిర్మూలన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు&period; ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు రియల్‌టైమ్‌లో స్పందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు&period; పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను శాఖలవారీగా విభజించి&&num;8230&semi; ప్రత్యేక కార్యాచరణతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు&period; క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు&comma; ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని&&num;8230&semi; అత్యవసర ఘటనల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు&period; విశాఖ తీరంలో బోటు ప్రమాదం వంటి సంఘటనల్లో తక్షణ స్పందనే ప్రభుత్వ పనితీరుకు ప్రమాణమని పేర్కొన్నారు&period; పట్టణ పరిశుభ్రతపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు&period; రాష్ట్రంలోని మున్సిపాలిటీలు&comma; కార్పొరేషన్లలో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలని ఆదేశించారు&period; ఇంటింటికీ చెత్త సేకరణ&comma; స్వచ్ఛ రథాల నిర్వహణకు స్పష్టమైన కార్యాచరణ అమలు చేసి&&num;8230&semi; జీరో వేస్ట్ పట్టణాలు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు&comma; మహిళలపై నేరాల నియంత్రణ&comma; గంజాయి నిర్మూలన&comma; ప్రభుత్వ పథకాల ఫలితాల విశ్లేషణపై కూడా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు&period; రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం టవర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు&period; అలాగే ప్రభుత్వ శాఖల పనితీరులో ఏఐ&comma; డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తరించాలని ఆదేశించారు&period; ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం&&num;8230&semi; సాంకేతికత ఆధారిత పాలన&&num;8230&semi; పరిశుభ్రమైన పట్టణాలు&&num;8230&semi; సమర్థవంతమైన పరిపాలనే ప్రభుత్వ ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు&&num;8230&semi; ప్రతి శాఖ ఫలితాల ఆధారంగా పనిచేసేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.