దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్‌.

Advertisements

<p>దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు&period; ప్రముఖ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఛైర్మన్&comma; సీఈవో లీ చియాంగ్-గెన్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు&period; గతంలో కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఫుట్‌వేర్ తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు&period;300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ తెలిపారు&period; దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ అండ్ డీ&comma; ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని&comma; షూఆల్స్ ఉత్పత్తులకు ఏపీని రిటైల్&comma; డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు&period; మంత్రి లోకేష్ సూచనలపై షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ సానుకూలంగా స్పందించారు&period; తమ సంస్థ మాగ్నెటిక్ థెరపీ&comma; షాక్ అబ్సార్ప్షన్ టెక్నాలజీతో మెడికల్ ఫుట్‌వేర్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు&period; ప్రస్తుతం సియోల్ నేషనల్ యూనివర్సిటీతో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని&comma; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.