సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సచివాలయంలో కీలక అడుగు పడింది&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 19à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది&period; రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చడమే ధ్యేయంగా సాగిన ఈ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసే దిశగా అడుగులు పడ్డాయి&period; ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు&comma; అనగాని సత్యప్రసాద్&comma; పి&period;నారాయణ&comma; గొట్టిపాటి రవికుమార్&comma; కందుల దుర్గేష్&comma; పయ్యావుల కేశవ్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్&comma; ఆయా శాఖల ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు&period; ఏపీలో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సచివాలయంలో 19à°µ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది&period; రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు&comma; ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు వీలుగా పలు కీలక రంగాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు&period;ముఖ్యంగా పరిశ్రమలు&comma; ఫుడ్ ప్రాసెసింగ్&comma; టూరిజం&comma; పెట్టుబడులు&comma; మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు&period; రాబోయే రోజుల్లో ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే లక్ష్యంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు&period; రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా&period;&period; మొత్తం 9 వేల 76 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 11 మెగా ప్రాజెక్టులపై ఈ ఎస్ఐపీబీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోద ముద్ర వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.