ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణకు శ్రీకారం.

ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణకు శ్రీకారం

Advertisements

<p>గోదావరి తీరంలో మరో కీలక మౌలిక వసతుల పనికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు నాయుడు&period; మూడు జిల్లాల పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేరుకున్న సీఎం&&num;8230&semi; ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను ప్రారంభించారు&period; సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్ల అమరిక చేపట్టనున్నట్లు ప్రకటించారు&period; వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి&comma; గోదావరి పుష్కరాల నాటికి బ్యారేజీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు&period; LOOK<&sol;p>&NewLine;<p>గోదావరి జలాల నిర్వహణలో కీలకమైన ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది&period; సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా బ్యారేజీ వద్దకు చేరుకుని గేట్ల పునరుద్దరణ పనులను ప్రారంభించారు&period; శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులకు శుభారంభం చేశారు&period;2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజీలో 58 కొత్త గేట్లను అమర్చింది&period; ప్రస్తుతం కేంద్ర జల సంఘం సూచనల మేరకు మిగిలిన 117 గేట్లను కూడా కొత్తవిగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది&period; దీని ద్వారా బ్యారేజీ భద్రతతో పాటు వరద నీటి నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి&&num;8230&semi; ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు&period; గేట్ల అమరిక&comma; నిర్మాణ నాణ్యత&comma; పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు&period; ధవళేశ్వరం బ్యారేజీ రాష్ట్రానికి ప్రాణాధారం&period; పనుల్లో ఎలాంటి రాజీ ఉండకూడదు&period; నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు&period;గోదావరి పుష్కరాల నాటికి కొత్త గేట్ల వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు&period; వరద నియంత్రణ&comma; సాగునీటి పంపిణీ&comma; డెల్టా ప్రాంత భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి&&num;8230&semi; గోదావరి డెల్టా మౌలిక వసతుల ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు&period; ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి డెల్టాకు ప్రధాన జలవనరు&period; దాదాపు శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న ఈ బ్యారేజీ ద్వారా తూర్పు&comma; పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విస్తారమైన వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది&period; పాత గేట్ల స్థానంలో కొత్త గేట్ల అమరిక ద్వారా వరదల సమయంలో నీటి విడుదల మరింత సురక్షితంగా నిర్వహించే అవకాశం ఉంటుంది&period; కేంద్ర జల సంఘం సూచనల మేరకు చేపడుతున్న ఈ పునరుద్దరణ పనులు గోదావరి డెల్టా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.