పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

Advertisements

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు&period; భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను ఫడ్నవీస్ కలిసి&comma; ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు&period; పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు&period; పవన్ కల్యాణ్ కుడి భుజానికి శనివారం సుమారు మూడున్నర గంటల పాటు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు&period; 2016లో ఆయన భుజానికి గాయమవగా&comma; ఇటీవలి రాజకీయ పర్యటనల్లో అభిమానులు&comma; కార్యకర్తల తాకిడి కారణంగా ఆ గాయం తీవ్రతరమైంది&period; దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు&period; ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని&comma; వేగంగా కోలుకుంటున్నారని వైద్య బృందం వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.