గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసహనం.

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసహనం

Advertisements

<p>గన్నవరం ఎమ్మెల్యే ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సొంత ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు&period; గన్నవరం ఎయిర్‌పోర్టు టెర్మినల్ పనుల కాంట్రాక్టును KMV సంస్థకు ఇవ్వడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్రంగా మండిపడ్డారు&period; గత ఎన్నికల్లో తమ ప్రత్యర్థుల కోసం&comma; వైసీపీ కోసం పనిచేసిన కంపెనీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు&period; ఎన్నికల సమయంలో పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడిన వారిని కాదని&comma; ప్రత్యర్థులకు కొమ్ముకాసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎన్నికల్లో నా రెక్కల కష్టం&comma; నా సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీని గెలిపించుకుంటే&period;&period; ఇప్పుడు నన్ను ఈ రకంగా అవమానాల పాలు చేస్తారా అంటూ నిలదీశారు&period; గన్నవరం నియోజకవర్గంలో తన హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు&period; ప్రజాప్రతినిధిగా ప్రోటోకాల్ ప్రకారం తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోతే అస్సలు సహించేది లేదని హెచ్చరించారు&period; ఎన్నికల ముందు వచ్చి కష్టపడిన వాడు ముఖ్యమా&period;&period;&quest; లేక అధికారం వచ్చాక మధ్యలో వచ్చిన వాడు ముఖ్యమా&period;&period;&quest; అంటూ యార్లగడ్డ వేసిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.