డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదు.

Advertisements

<p>మెగా డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి డీవియేషన్ జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు&period; ప్రతిభ&comma; మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో అత్యంత పారదర్శకంగా 15&comma;941 ఉపాధ్యాయ ఉద్యోగాలను 148 రోజుల్లోనే భర్తీ చేశామని తెలిపారు&period; అసెంబ్లీలో మెగా డీఎస్సీపై జరిగిన చర్చలో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం&period;&period; టెట్&comma; డీఎస్సీ నోటిఫికేషన్ల నుంచి రిజర్వేషన్లు&comma; పరీక్షలు&comma; ఫలితాల వరకు ప్రతి దశను నిబంధనల ప్రకారమే నిర్వహించామన్నారు&period; 13 సబ్జెక్టులకు 42 వేల ప్రశ్నలను ఎంపిక చేసి 154 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>2019-24 మధ్య ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయని గత ప్రభుత్వం&period;&period; విద్యారంగంపై గొప్పలు చెప్పుకుందని చంద్రబాబు విమర్శించారు&period; ఇప్పటివరకు జరిగిన 14 డీఎస్సీల్లో 11 డీఎస్సీలు టీడీపీ&comma; ఎన్డీయే ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని తెలిపారు&period; విద్యార్థులకు నాణ్యమైన విద్య&comma; నైపుణ్యాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు&period; నియామక ప్రక్రియ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని&comma; ఫిర్యాదుల పరిష్కారానికి జోనల్&comma; రాష్ట్రస్థాయి కమిటీలతో పాటు అప్పీలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు హిట్ అండ్ రన్ తరహా దుష్ప్రచారమని చంద్రబాబు మండిపడ్డారు&period; దమ్ము&comma; ధైర్యం ఉంటే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు&period; సభకు రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారని ప్రతిపక్ష సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన టీచర్ల ప్రతిభను కించపరిచేలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు&period; తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని&comma; ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా&comma; జవాబుదారీతనంతో జరిగాయని సీఎం పునరుద్ఘాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.