కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం.

Advertisements

<p>వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు&period; రైతులకు12 వేల 500 రూపాయలు ఇస్తామని చెప్పి&period;&period; అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 7వేల 500 రూపాయల మాత్రమే ఇచ్చి జగన్ మోసం చేశారని విమర్శించారు&period; రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు&period; ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు&period; కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు&period; రైతుల సంక్షేమంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు&period; జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు&period;<br &sol;>&NewLine;గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం&comma; అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు&period; ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు&period; గతంలో నిధులు కేటాయించినప్పటికీ పనులు ఎందుకు ముందుకు సాగలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

PS రాయలసీమ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు.

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.