ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.

Advertisements

<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు&period; &OpenCurlyQuote;మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి&period;గన్నవరం నియోజకవర్గంలోని పండువారిపేటలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు&period; అంతకుముందు మాచవరం జయంతి నగర్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు&period; ప్రజాప్రతినిధులు&comma; అధికారులతోనూ సీఎం సమావేశం కానున్నారు&period; మధ్యాహ్నం బుడుంగపేటలో పార్టీ కేడర్‌తో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు&period;<&sol;p>&NewLine;<p>కోనసీమలో దశాబ్దాలుగా పరిష్కారం కాని గ్రౌండ్ రెంట్ భూముల సమస్యపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది&period; అమలాపురం&comma; అంబాజీపేట&comma; ముమ్మిడివరం&comma; రామచంద్రాపురం ప్రాంతాల్లోని 56&period;37 ఎకరాల భూములు 22-A నిషేధిత జాబితాలో ఉండటంతో 1&comma;416 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి&period; క్షేత్రస్థాయి విచారణల అనంతరం వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు&period; దీనివల్ల 1&comma;281 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి&period; నేటి పర్యటనతో భూ హక్కులపై ప్రజలకు మరింత భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.