టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.

Advertisements

<p>టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా &OpenCurlyQuote;నిజం గెలిచింది’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు&period; చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించినందుకు నిరసనగా&comma; ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు గుర్తుగా పార్టీ కార్యాలయాలు&comma; ఇళ్లు&comma; బూత్ స్థాయిలో 53 దీపాలు వెలిగించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు&period; మంగళగిరిలో జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో మాట్లాడిన లోకేశ్&period;&period; కార్యకర్తల పోరాటాలు&comma; త్యాగాల వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు&period; నాయకులు పార్టీ&comma; పర్సనల్&comma; ప్రభుత్వం అనే మూడు &OpenCurlyQuote;పీ’à°² సూత్రాన్ని పాటించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>నేతలు అహంకారాన్ని వీడి ప్రజలకు&comma; కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని లోకేశ్ హితవు పలికారు&period; కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి&comma; అలకబూనిన వారిని దగ్గరకు తీసుకోవాలని సూచించారు&period; నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి నాయకులు చొరవ చూపాలని&comma; పాఠశాలలు&comma; ఆసుపత్రులను తనిఖీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు&period; వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఐక్యంగా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు&period; ఇది టీడీపీ 3&period;0 వెర్షన్ అని&comma; &OpenCurlyQuote;నో ఇగో&period;&period; ఓన్లీ సర్వీస్’ నినాదంతో పనిచేయాలని నేతలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.