వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.

Advertisements

<p>ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; వైసీపీ సీనియర్ నేత&comma; ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు&comma; విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు&period; మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను&period;&period; ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు&period; ఆయనతో పాటు కుమార్తె సిరి సహస్ర&comma; అనుచరులు కూడా టీడీపీలో చేరారు&period; ఈ కార్యక్రమంలో మంత్రులు&comma; మాజీ మంత్రులు&comma; ఎంపీలు&comma; ఎమ్మెల్యేలు&comma; ప్రజాప్రతినిధులు&comma; పార్టీ నేతలు పాల్గొన్నారు&period; బొత్స కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కీలక నేత పార్టీ మారడం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>వైసీపీకి రాజీనామా సందర్భంగా విజయనగరం జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా చిన్న శ్రీను వదులుకున్నారు&period; ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక బాధ్యతల్లో చురుగ్గా పనిచేసిన ఆయన&period;&period; కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది&period; బొత్స సత్యనారాయణతో అంతర్గత విభేదాల కారణంగానే పార్టీ మారారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ&comma; తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలేనని చిన్న శ్రీను పేర్కొన్నట్లు సమాచారం&period; స్థానిక ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఆయన చేరిక టీడీపీకి బలంగా మారుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి&period; ఈ పరిణామం వైసీపీపై&comma; ముఖ్యంగా బొత్స కుటుంబ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.