చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

Advertisements

<p>తెలుగుదేశం పార్టీ అధినేత&comma; సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి&comma; టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు&period; &OpenCurlyQuote;నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు&period; కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు&period;<br &sol;>&NewLine;మూడేళ్ల క్రితం ఇదే రోజున నాటి సీఎం జగన్ రాజకీయ దురుద్దేశంతో&comma; కుట్రపూరితంగా తప్పుడు కేసు బనాయించి చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయించారని లోకేశ్ ఆరోపించారు&period; ఆ కేసులో చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా జైలులో నిర్బంధించారని పేర్కొన్నారు&period; ఆ చీకటి రోజులకు గుర్తుగా&comma; నాటి నిర్బంధాన్ని నిరసిస్తూ 53 కొవ్వొత్తులు వెలిగించినట్లు తెలిపారు&period;<br &sol;>&NewLine;చంద్రబాబు అరెస్టు జరిగిన రోజు ప్రజాస్వామ్యానికే చీకటి రోజని లోకేశ్ వ్యాఖ్యానించారు&period; అయితే చివరికి నిజమే గెలిచిందని అన్నారు&period; ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ కూటమి అధికారంలోకి రావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.