ప్రభుత్వ బడులకు కార్పొరేట్ హంగులు.

Advertisements

<p>ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది&period; నెల్లూరు నగరంలో సీఎస్ఆర్ నిధులతో ఆధునికంగా అభివృద్ధి చేసిన రెండు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు&period; పాఠశాలలను సందర్శించిన ఆయన&period;&period; తరగతి గదులు&comma; ప్రయోగశాలలు&comma; డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు&period; మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీసి&period;&period; బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు&period;<&sol;p>&NewLine;<p>నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో రెండు అంతస్తుల్లో నిర్మించిన పాఠశాలలో 43 తరగతి గదులను అందుబాటులోకి తెచ్చారు&period; ప్రతి తరగతి గదిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు&comma; ఆధునిక బెంచీలు ఏర్పాటు చేశారు&period; కంప్యూటర్&comma; రోబోటిక్స్&comma; ఆస్ట్రో&comma; ఫిజిక్స్&comma; కెమిస్ట్రీ&comma; బయాలజీ ల్యాబ్‌లతో పాటు ఆర్ట్&comma; మ్యూజిక్&comma; డ్యాన్స్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు&period; క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ఎకరం విస్తీర్ణంలో ఫుట్‌బాల్&comma; వాలీబాల్&comma; బ్యాడ్మింటన్ కోర్టులతో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు&period;<&sol;p>&NewLine;<p>అనంతరం మూలపేట 39à°µ డివిజన్‌లో రూ&period;13&period;4 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన డీఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాలను కూడా లోకేశ్ ప్రారంభించారు&period; ఆర్‌ఎస్‌ఆర్ పాఠశాల పనితీరుపై ప్రధానోపాధ్యాయుడు&comma; అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి&period;&period; కేవలం భవనాలు నిర్మిస్తే సరిపోదని&comma; విద్యా ప్రమాణాలు&comma; ఫలితాలు కూడా మెరుగుపడాలని స్పష్టం చేశారు&period; గతేడాది పదో తరగతిలో 60&period;19 శాతం ఉత్తీర్ణత నమోదవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి&period;&period; హాజరు&comma; ఎన్‌రోల్‌మెంట్ తగ్గడానికి కారణాలను తెలుసుకుని&comma; ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడేలా ఫలితాలు పెంచాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.