గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.

Advertisements

<p>నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి&comma; బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి&period; ఘటనకు అధికారుల నిర్లక్ష్యం కారణమా&period;&period; లేక దుండగుల చర్యనా అనే కోణాల్లో విచారణ జరిపిస్తున్నామన్నారు&period; బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు&period; నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు&period; రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు&period; ఘటనలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం సంభవించకపోవడం కొంత ఉపశమనం లభించిందన్నారు ఎమ్మెల్యే చరితారెడ్డి&period; గోరుకల్లు గ్రామంలోకి నిన్న తెల్లవారు జామున అకస్మాత్తుగా భారీగా చేరిన రిజర్వాయర్ నీటి ప్రవాహం భారీగా చేరింది&period; గుర్తు తెలియని వ్యక్తులు గేటు ఎత్తడంతో ఎస్ఆర్‌బిసి సబ్ కెనాల్‌ పొంగి ఊళ్లోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం చేరింది&period; దీంతో గ్రామస్థులు రిజర్వాయర్ తెగిపోయిందనే ప్రాణ భయంతో వేణుగోపాల స్వామి కొండెక్కారు&period; సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు&period; అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు&period; ఇదిలావుండగా గోరుకల్లు గ్రామాన్ని కలెక్టర్ రాజకుమారి సందర్శించారు&period; ఈ ఘటనపై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఘటనకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర హెచ్చరించారు&period;ఎస్ఆర్‌బిసి కాల్వకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు విచారణ.

ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.