పల్నాడు జిల్లాలో అవకాడో సాగు పేరుతో అక్రమ దందా ..

Advertisements

<p>కాదేది అక్రమాలకు అనర్హం అని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాలోని కొందరు మోసగాళ్లు&period; మిగతా ఏవైనా ఇబ్బందికరమని అనుకున్నారో ఏమో&period;&period; ఏకంగా పండ్ల తోటలను రియల్‌ ఎస్టేట్‌ మోసానికి మార్గంగా ఎంచుకున్నారు&period; అత్యంత ఖరీదైన అవకాడో పండ్లను పండించి&period;&period; లక్షల రూపాయల ఆదాయం వచ్చేలా చేస్తామంటూ&&num;8230&semi; వందల మందిని బురిడీ కొట్టించింది వినుకొండ ప్రాంతానికి చెందిన గాయత్రి 99 అవకాడో ఫామ్‌ సంస్థ&period; మార్కెట్లో ఆవకాడో విలువ కిలో 500 రూపాయలకు పైగా పలుకుతుందని&comma; ఒక్కొక్క చెట్టుకు 20-30 కేజీల దిగుబడి వస్తుందని&comma; సెంటు భూమిలో 10 మొక్కలు వస్తాయని నమ్మబలికారు&period; మూడేళ్ల తరువాత పంట చేతికి వస్తుందని&comma; అప్పటి వరకు మొక్కల సంరక్షణ బాధ్యత తమదే అని బురిడీ కొట్టించారు&period; దిగుబడి సమయానికి యజమానికి అప్పగిస్తామని నమ్మిస్తున్నారు&period; అప్పటి నుండి ప్రతి ఏటా అవకాడో యజమానికి లక్షల్లో ఆదాయం వస్తుందని ఆశ చూపి అక్రమ రిజిస్ట్రేషన్లతో డబ్బులు దండుకుంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>విన్నారుగా ఇలాగే ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్లు కొల్లగొట్టింది&period;&period; గాయత్రి 99 సంస్థ&period; దీనికోసం ముందస్తుగానే పకడ్బందీ వ్యూహాన్ని పన్నింది&period; వినుకొండ ప్రాంతంలో 5 నుంచి 10 లక్షల రూపాయలు ఎకరం చొప్పున దాదాపు 1500 ఎకరాల బీడు భూములను కొనుగోలు చేసింది&period; వాటిలో అవకాడో ఫామింగ్‌ చేపట్టి&&num;8230&semi; సెంటు భూమిని లక్ష చొప్పున అమ్మేందుకు ప్లాన్‌ వేశారు&period; ఈ రకంగా గుంటూరుకు చెందిన కొంతమంది రియల్టర్లు 600 ఎకరాల్లో అనుమతులు లేకుండా అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేసి ఆన్లైన్ బుకింగ్ ద్వారా విక్రయించారు&period; సెంటు రూ&period;లక్ష చొప్పున 6 సెంట్లు&comma; 10 సెంట్లు&comma; 15 సెంట్లు ప్లాట్లుగా వేసి అమ్ముకుంటున్నారు&period; ఎకరం రూ&period;8 లక్షలకు కోనుగోలు చేసిన ఈ రియల్టర్లు అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్ పేరుతో ఎకరం రూ&period;కోటి వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు&period; బొల్లాపల్లి మండలం సరికొండపాలెం కొండ చూట్టూ షుమారు 500 ఎకరాల్లో అనేక మంది రియల్టర్లు అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్లను వేసి అమ్ముకుంటున్నారు&period; కొప్పుకొండ ప్రాంతంలో వందల ఎకరాల్లో అవకాడో వెంచర్లు వేలిశాయి&period; మొత్తంగా 1500 ఎకరాలకు పైగా వినుకొండ ప్రాంతంలో అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచరును అక్రమంగా సాగు చేస్తున్నట్లు తెలిసింది&period;&period;<&sol;p>&NewLine;<p>అయితే ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో కొంతమందికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది&period; దీంతో వారంతా గాయత్రి సంస్థకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు&period; ఎన్నో మాయ మాటలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>వాస్తవానికి అవకాడో ఫామ్ ల్యాండ్ వెంచర్ వేయాలంటే ఫారెస్టు&comma; ల్యాండ్ కన్వర్షన్&comma; ఫుడా&comma; లే అవుట్ అప్రూవల్స్ తదితర ప్రభుత్వ అనుమతులన్నీ ఉండాలి&period; కానీ ఇవేమీ లేకుండానే అక్రమార్కులు అవకాడో ఫామ్ల్యాండ్ వెంచర్లు వేసి కోట్లు కొల్లగొడుతున్నారు&period; ఐనవోలు వద్ద వేసిన 600 ఎకరాల అవకాడో వెంచర్లో అధిక శాతం వాగు పోరంబోకు&comma; ప్రభుత్వ భూములున్నాయని భాదితులు కొందరు పల్నాడు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;<p>పల్నాడు జిల్లాలో అవకాడో ఫామింగ్‌ పేరిట సాగుతున్న దందాపై మరింత సమాచారం మా రీజినల్‌ న్యూస్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌ లైవ్‌లో అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.