క్యాతనపల్లి మున్సిపాలిటీ రైల్వే గేటు వద్ద కేరళ ఎక్స్ప్రెస్ రైలు డికోని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన సంఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనం పై మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్ వస్తున్న ఆర్కే1 సుభాష్ నగర్ చెందిన ఇద్దరు రైల్వే గేటు పడి ఉండటంతో గేటు కింది నుండి ద్విచక్ర వాహనాన్ని దాటిస్తున్న క్రమంలో వేగంగా వస్తున్న రైలును గమనించక రైలు డికోని భూక్యా సురేష్, చంద్రమౌళి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్లక్ష్యంతోనే రైలు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని కాంగ్రెస్ నాయకులు గడ్డం వంశీ, అబ్దుల్ అజీజ్, ఎర్రబెల్లి రాజేష్, సత్యపాల్, గొపతీ రాజయ్య, పల్లె రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మాణం లొ ఉన్న రైల్వే బ్రిడ్జి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.కమిషన్లు దండుకున్న బాల్క సుమన్ సదరు కాంట్రాక్టర్ తో బ్రిడ్జి పనులను పూర్తి చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత విప్ సుమన్ పై ఉందన్నారు. మరణించిన కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు.జరిగిన సంఘటన చాలా బాధాకరమని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బాల్క సుమన్ నిర్లక్ష్యమే రైలు ప్రమాదానికి కారణం..
88