భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు వారం రోజుల క్రితం గుంటలో పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ డెడ్ బాడీని శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో శవాన్ని రిపోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఈ పోస్ట్ మాస్టర్ సందర్భంగా కందుకూరు సిఐ. నఫీజ్ భాష ఉలవపాడు ఎస్ఐ బాజీ రెడ్డి ఎంపీడీవో చెంచమ్మ, ఎమ్మార్వో బ్రహ్మయ్య, వీఆర్వోలు, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఆ బాలుడు చనిపోక ముందే ఆ గుంటలపై జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు సాకేత్ మరణించేవాడు కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల సాకేత్ మరణం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అర్థం అవుతుంది. మరణానికి కారుకులైన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఒక దళిత బాలుడు ప్రాణాలు కోల్పోయాడని, బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఒక అధికారి కూడా సందర్శించి సానుభూతి తెలియజేయలేదని, అంత అమానవీయంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాలకి నిద్ర పట్టకుండా ఓట్ల వేట్ల కొనసాగించే అధికార ప్రతిపక్ష నాయకులు ఆదుకునేందుకు ఇంటికి రాలేదని ఆర్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి..
68
previous post