వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు కేంద్రం బ్రేక్‌.

Advertisements

<p>ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తీసుకురావాలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది&period; ఈ వివాదాస్పద ఫీచర్ పై స్పందించేందుకు వాట్సప్ మాతృసంస్థ మెటాకు మరో మూడురోజులు గడువిచ్చింది కేంద్రం&period; అయితే&period;&period;ఈ ఫీచర్ పై ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా ముగిసేంతవరకూ భారత్‌లోకి అందుబాటులోకి తీసుకురాబోమని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకరితో ఒకరు చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి&period; అయితే వాట్సప్&period;&period;ఈ ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసేలా కొత్త ఫీచర్ ను డిజైన్ చేసింది&period; ఐతే దీనివల్ల ఆన్లైన్ మోసాలు&comma; ఫిషింగ్&comma; డిజిటల్ అరెస్ట్ స్కాములు&comma; ఒకరిపేరుతో మరొకరు చలామణి అయ్యే ముప్పు విపరీతంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది&period; నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;<p>దీనిపై వివరణ ఇచ్చిన వాట్సాప్‌&period;&period;సైబర్ నేరాలను అడ్డుకునేందుకు బలమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది&period; సెలబ్రిటీలు&comma; రాజకీయ నాయకులు&comma; ప్రభుత్వ సంస్థల పేర్లతో నకిలీ ఐడీలు క్రియేట్ చేయకుండా&period;&period;ఆయా పేర్లను ముందే హోల్డ్ లో ఉంచినట్లు తెలిపారు&period; అలాగే ఇందులో లిమిటెడ్ సెర్చ్ ఉంటుందని&comma; ఒకరి యూజర్ నేమ్ పూర్తిగా తెలిస్తేనే మెసేజ్ చేయగలరని&comma; ఊహాజనితంగా పేర్లను టైప్ చేసి వెతికే ప్రయత్నాలను సిస్టమ్ బ్లాక్ చేస్తుందని తెలిపింది&period; ఎవరైనా కొత్త వ్యక్తి యూజర్‌నేమ్ ద్వారా మొదటిసారి మెసేజ్ చేస్తే&period;&period; ఆ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయింది&quest; వారు ఏ దేశానికి చెందినవారు&quest; మనతో ఏవైనా మ్యూచువల్ గ్రూప్స్ ఉన్నాయా&quest; అనే వివరాలను వాట్సాప్ యూజర్‌కు చూపిస్తుందని వివరించింది&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉంటే&period;&period;కేవలం వాట్సాప్ మాత్రమే కాదు&period;&period;ఇప్పటికే యూజర్‌నేమ్ ఫీచర్‌ను రన్ చేస్తున్న టెలిగ్రామ్&comma; సిగ్నల్ యాప్‌లకు కూడా కేంద్రం నోటీసులు పంపింది&period; ఈ ఫీచర్ల ద్వారా జరుగుతున్న మోసాలను&comma; నకిలీ అకౌంట్లను ఎలా అరికడుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది&period; దీంతో పాటు&comma; పైరసీ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నందుకు టెలిగ్రామ్‌కు&comma; ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌లో చైల్డ్ అబ్యూస్ మెటీరియల్‌పై మెటాకు కేంద్రం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.