అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సంబరాలు..

Advertisements

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రగతి పండుగ పేరుతో అంబరాన్నంటాయి&period; ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి&comma; జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు&period; తేర్ బజార్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి టీజీ భరత్&comma; ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుతో కలిసి భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు&period; నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు&period; రాయదుర్గం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు&period; ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనతో పాటు&comma; టెంపుల్ టూరిజం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు&period; త్వరలో తాను చేపట్టబోయే జర్మనీ పర్యటనలో రాయదుర్గం టెక్స్టైల్స్ పరిశ్రమపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు వెల్లడించారు&period; అమరావతి శాశ్వత రాజధాని కావడం పట్ల మంత్రి భరత్‌ గుప్తా హర్షం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.