విశాఖలో నకిలీ పోలీసుల హల్ చల్ (fake police in vizag)
విశాఖలో వెలుగులోకివచ్చిన ఉద్యోగాల పేరుతో భారీ మోసం. మోసాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసులు గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. నిందితుడు రమేష్ కుమార్ 2008 నుండి 2022 వరకు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్(CRPF Constable) గా పని చేసి సస్పెండ్ అయ్యాడు. ఎస్.ఐ అని చెప్పి రైల్వే జాబ్స్ ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన వైనం. 12 మంది వరకు మోసం చేసి 85 లక్షలకు పైగా డబ్బులు వసూళ్లు. విజయవాడలో ఫేక్ ఎగ్జామ్ కూడా నిర్వహించిన కేటుగాళ్లు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రమేష్ తోపాటు ప్రవీణ అనే అమ్మాయి కూడ కలిసే మోసాలు చేసారు. ప్రవీణ డి.ఆర్.ఎం పిఎ అని అధికారులతో పరిచయం ఉందంటూ బాదితులకు కుచ్చుటోపీ. రమేష్ నుంచి ఫేక్ పోస్టింగ్ పేపర్స్, పోలీస్ డ్రెస్, కార్, డమ్మీ పిస్టల్ , బూట్లు, బెల్టు, స్వాధీనం చేసుకున్న పోలీసులు. రమేష్ వెనుక ఎవరు ఎవరు ఉన్నారు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి