70
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ రోడ్డు సమీపంలో పార్వతీపురం నుండి విజయనగరం వైపు వస్తున్న లారీ, అంబటివలస నుండి గొట్లాం వైపు సైకిల్ పై వెళ్తున్న తాళ్లపూడి బుచ్చినాయుడు(55)ను వెనుక నుండి ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే సైకిలీస్ట్ మృతి చెందారు. బొండపల్లి పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.