శ్రీకాకుళం జిల్లా, ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం(Arasavalli Suryanarayana Swamy temple)లో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు. రథసప్తమి Ratha sapthami నీ పురస్కరిచుకొని సుందరం గా ముస్తాబు అయిన అరసవల్లి సూర్య దేవాలయం. మేళతాళలతో, వేద మంత్రోచ్ఛరణతో పులకిస్తున్న అనివెట్టి మండపం. తొలి పూజ ను నిర్వహిస్తున్న విశాఖ శారద పీఠం నుండి ఉత్తరదికారి సాత్మానందేంద్ర సరస్వతి. సూర్య దేవుని మూల విరాట్ కి ప్రారంభమైన క్షీరాభిషేకం.
శారదాపీఠ ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ..
అరసవల్లి అభివృద్దికి శారదాపీఠం ఎప్పుడూ ముందజలో ఉంటుందని విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. శారదా పీటం నుండి సూర్యనారాయన స్వామి వారికి పట్టు వస్త్రాలతో పాటు, పలు రకాల ద్రవ్యాలను తీసుకొని అనివెట్టి మండపానికి మేళ తాలతో, వేద మంత్రోచ్ఛరణలతో వేంచేశారు. అనివెట్టి మండపంలో ఆయన సంకల్పం చెప్పి స్వామివారికి తెచ్చిన పట్టు వస్త్రాలను, ఆశ్రమం నుండి తెచ్చిన పాలను తీసుకొని మూలవిరాట్టు వద్దకు వెళ్లి తొలి పూజ చేసి క్షీరాభిషేకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరసవల్లి అభివృద్దికి కృషి చేస్తున్నామని, మా పీఠానికి అరసవల్లితో ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రప్రధమంగా తాము ఇక్కడ పూజలు చేయడం జరుగిందన్నారు. రధసప్తమికి రాని భక్తులకు ఆశీస్సులు కలగాలని తాము ప్రార్ధంచామన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు..
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి దర్మాన ప్రసాదరావు, ఎంపి రామ్మోహన్ నాయుడు, ఎమ్మేల్యే లు గోర్లే కిరణ్, విశ్వసరాయి కలావతి, కంబాల జోగులు, చీపురుపల్లి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మేల్సి వరుదు కల్యాణి..
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..
రధసప్తమి వేడుకలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చాలా బాగా చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సతీ సమేతంగా మంత్రి ధర్మన ప్రసాదరావు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ధర్మాన అనివెట్టి మండపం వద్ద మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణతో అందరూ భగవంతుని దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసాయన్నారు. ఇది ప్రపంచంలో ప్రసిద్ది చెందిన దేవాలయం. ఇంత సంపూర్ణంగా పూజలు జరిగే ఆలయం ఎక్కడా లేదన్నారు. సూర్యుని నమ్మిన వారు తప్పకుండా రధసప్తమి రోజున వచ్చి స్వామివారిని దర్శంచుకుంటారని తెలిపారు. పాలకమండలి సభ్యులు కూడా చాలా బాగా పని చేస్తున్నారన్నారు.. విజయవాడ నుండి రాగానే స్వామి వారి దర్శనం చేసుకున్నానన్నారు. దేశ ప్రజలతో పాటు, తమ కుటుంబసభ్యులకు ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుని ఆశీస్సులు కలగాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు.
రధసప్తమి(Ratha sapthami) సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..
అరసవల్లి క్షేత్రంలో సూర్య భగవానుని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. స్వామి కృప అందరికీ కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు రధసప్తమి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు మంచి సంవత్సరంగా ఉండి, ప్రకృతి విపత్తలు లేకుండా ఉండాలని కోరుకున్నానన్నారు. ఆరోగ్యానికి ప్రతీక సూర్య భగవానుడు కనుక ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నికల వస్తున్న సంవత్సరం ఈ వేడి, రేపటి నుండి సూర్యుని వేడి పెరుగుతుంది. కనుక భవిష్యత్తులో రాష్ట్రంను అభివృద్దికి తీసుకొని వెళ్లే ప్రభుత్వంను ప్రజలు ఎన్నుకోవాలని, రాష్ట్ర ప్రజలకు సద్బుద్దిని ప్రసాదించాలని కోరకున్నట్లు తెలిపారు. తమ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని భావిస్తున్నానని అన్నారు. సూర్య భగవానుని దర్శనానికి లక్షల మంది భక్తులు రధసప్తమి రోజున రానున్నారని అన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నడిపించాలని కోరుతున్నానన్నారు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.