తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి. డిసెంబరు 22న అదే రోజు దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల రద్దు. డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభం. డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేత. డిసెంబరు 22వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇతర భక్తులు పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరిన టిటిడి.
భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు సర్వదర్శనం టికెట్లు రద్దు
60
previous post