శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థల నిలువు దోపిడీ..

Advertisements

<p>&ZeroWidthSpace;శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి&period; విద్యార్థుల తల్లి తండ్రుల నుంచి విద్యాసంస్థల నిలువు దోపిడీ చేస్తున్నాయి &period; నిబంధనలకు విరుద్ధంగా&comma; కనీస అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి&period; తాజాగా &&num;8216&semi;బ్రిలియంట్&&num;8217&semi; &comma; &&num;8216&semi;జే వై&&num;8217&semi; విద్యాసంస్థల వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; ముఖ్యంగా &ZeroWidthSpace;శ్రీకాకుళం నగరం&comma; సోంపేట తో పాటు జిల్లాలోని ఇతర ప్రధాన మండల కేంద్రాల్లో నడుస్తున్న జే వై విద్యాసంస్థలకు పూర్తిస్థాయిలో అనుమతులు లేవని స్వయంగా జిల్లా విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి&period; అదే విధంగా గత కొన్నేళ్లుగా బ్రిలియంట్ విద్యాసంస్థలను నడుపుతున్న యాజమాన్యం ఇప్పుడు జే వై సంస్థలతో కలిసి నడుస్తున్నామంటూ బహిరంగంగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి&period; ఈ సంస్థల తీరుపై ఇప్పటికే డీఈఓ కార్యాలయ సిబ్బంది పలుమార్లు నోటీసులు జారీ చేసినా&comma; యాజమాన్యాల్లో మార్పు రాకపోవడం గమనార్హం&period;<&sol;p>&NewLine;<p>&ZeroWidthSpace;కొత్తూరులోని బ్రిలియంట్ స్కూల్ వ్యవహారంపై సివిఆర్ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి&period; హైస్కూల్ నిర్వహణకు ఎటువంటి గుర్తింపు లేకపోయినా&comma; ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులతో పరీక్షలు రాయించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ వెల్లడించారు&period; తమ ఒక్క స్కూలే కాదని జిల్లాలో చాలా పాఠశాలలు గుర్తింపు లేకుండానే పదో తరగతి బోధన సాగిస్తున్నాయని &&num;8220&semi;అధికారులు లంచాల కోసమే తమకి రికగ్నైజేషన్ ఇవ్వడం లేదని చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది &period; అధికారుల అవినీతిని సాకుగా చూపిస్తూ&comma; వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న వైనం చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే<&sol;p>&NewLine;<p>&ZeroWidthSpace;అనుమతులు లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి&comma; రేపు సర్టిఫికేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు&period; ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి&comma; నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి తండ్రులు కోరుతున్నారు&period; లేనిపక్షంలో మరిన్ని విద్యాసంస్థలు ఇదే బాటలో నడిచి వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..