తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం నియోజకవర్గం.. తెల్లవారుజామున ఐదుగురు వ్యక్తులు నన్నయ్య యూనివర్సిటీ సమీపంలో పిడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనం ఆపి లక్ష రూపాయలు నగదు డిమాండ్ చేశారు. పిడిఎస్ బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం తో విలేకరితో వచ్చామని లక్ష రూపాయలు ఇవ్వకపోతే కేసులు పెడతాం అంటూ నకిలీలు నగదు డిమాండ్ చేశారు. కార్ లో విజిలెన్స్ అధికారులు ఉన్నారంటూ, అడిగిన నగదు ఇవ్వకపోతే జైలుకు పంపుతామంటూ వ్యాన్ లో ఉన్న వ్యక్తి కి బెదిరించారు. నూజివీడు నుండి కాకినాడ వైపు తరలిస్తుండగా రాజానగరం లొ పిడిఎస్ బియ్యం వాహనాన్ని ఆపిన ఐదుగురు వ్యక్తులలో ఇద్దరు నకిలీలు.. హైవే పై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు చిక్కారు. 20 వేలు నగదుతో మరికొంతమంది వ్యక్తులు పరారయ్యారు. పిఠాపురం కు చెందిన బాధితుడు సంగుల వరప్రసాద్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. గతంలో ఇదే వాహనం పలుమార్లు ఆపి నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో తెలిసిందని సిఐ కాశీ విశ్వనాధ్ వెల్లడించారు.
నకిలీ విజిలెన్స్ అధికారుల ఆటకట్టించిన పోలీసులు..
81
previous post