సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ.

Advertisements

<p>టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇవాళ నాంపల్లి కోర్టులో జరిగింది&period; ప్రస్తుతం షూటింగ్ కోసం ముంబైలో ఉన్న కారణంగా&comma; అల్లు అర్జున్ ఈ విచారణకు కోర్టు అనుమతితో వర్చువల్ గా హాజరయ్యారు&period; గత వాయిదా సమయంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరగా&comma; న్యాయస్థానం నేడు ఆయనను వర్చువల్‌గా విచారణలో పాల్గొనేందుకు అనుమతించింది&period; ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌కు సంబంధించి కీలక ప్రక్రియ ఇవాళ పూర్తయింది&period; ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చింది&period; కోర్టు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ &lpar;PP&rpar; నిందితులందరికీ దాదాపు 500 పేజీల భారీ ఛార్జిషీట్ కాపీలను అధికారికంగా అందజేశారు&period;<&sol;p>&NewLine;<p>ఛార్జీషీట్ కాపీల పంపిణీ అనంతరం న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది&period; 2024 డిసెంబర్ 4à°¨ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో &&num;8216&semi;పుష్ప &&num;8211&semi; 2&&num;8217&semi; సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు&period; ఆ సమయంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా&comma; ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు&period; ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యం&comma; అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.