షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘జయం'(Jayam)
స్రవంతి సినిమా(Sravanthi Cinema) పతాకంపై కంటూరు రవికుమార్ చౌదరి నిర్మాతగా, జి. కిరణ్‌కుమార్ దర్శకత్వంలో సత్య మేరుగు`దీపిక జంటగా రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జయం’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్‌లాంచ్(Jayam first look poster) ఈవెంట్‌ను నిర్వహించింది. ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, పీపుల్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణలు ముఖ్య అతిథిలుగా హాజరై ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
నిర్మాత రవికుమార్ చౌదరి ఇంతకు ముందే 4 సినిమాలు తీసి ఉండటంతో ఆయనకు మంచి అనుభవం ఉందని భావిస్తున్నాను. ‘జయం’ అనే టైటిల్ ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది అన్నారు.
పీపుల్స్మీడియా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ…
నిర్మాత చౌదరి గారితో నాకు ముందు నుంచీ పరిచయం ఉంది. మంచి అభిరుచిగల నిర్మాత. ఈ సినిమాకు మంచి కాస్టింగ్, టెక్నీషియన్స్‌ను ఎంచుకున్నారు. తేజ గారి జయం చిత్రం లాగే ఈ జయం కూడా అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు చేతనైన సాయం చేస్తాను అన్నారు.
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…
స్రవంతి బ్యానర్(sravanthi banner) ద్వారా రవికిషోర్‌గారు చాలాపెద్ద ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఇప్పుడు ఈ స్రవంతి సినిమా ద్వారా ఈ చిత్ర నిర్మాత రవికుమార్ చౌదరి కూడా పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా. గతంలో 4 సినిమాలు తీసిన అనుభవం ఈ నిర్మాతది. కాబట్టి ఆయనకు సినిమా మేకింగ్ విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన పనిలేదు. గతంలో తేజ గారు చేసిన జయం ద్వారా ఎంతోమందికి లైఫ్ వచ్చింది. ఈ సినిమాతో కూడా కొందరు కొత్త వారికి లైఫ్ వస్తుందని ఆశిస్తున్నా. చిన్న సినిమాలకు మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది అన్నారు.
చిత్ర నిర్మాత రవికుమార్ చౌదరి మాట్లాడుతూ…
ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థ్యాంక్స్. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆ జయం లాగే ఈ జయం కూడా అంతే సక్సెస్ అవుతుంది అనిపించింది. మంచి విజన్ ఉన్న దర్శకుడు కిరణ్‌కుమార్. నేను ఇప్పటికే 4 సినిమాలను నిర్మించాను. వాటి ద్వారా 10 మంది హీరోలను పరిచయం చేశాను. ఈ సినిమా అందరికీ పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శకుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ…
మంచి కథకు మంచి నటులు, టెక్నీషియన్స్ దొరికారు. టైటిల్ ఎంత బాగుంటుందో.. సినిమా కూడా అంతే బాగుంటుంది. మంచి లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేశాం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో, హీరోయిన్లు సత్య మేరుగు`దీపిక, దేవరూపం, దసరా ఫేం మోహన్, కుప్పిలి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రేమ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్ పూర్ణచంద్రశేఖర్‌రావు తదితరులు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్ రవిరామ్, ఆర్మాన్ మేరుగు, ఎం. ఐలేష్ కుమార్, డీఓపీ: యుఎస్ విజయ్, కొరియోగ్రఫీ: మోహన్ కృష్ణ, హరి తాటిపల్లి, ఫైట్స్: రాజేష్ లంక, పీఆర్వో: బి. వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రేమ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: పూర్ణచంద్రశేఖర్‌రావు, నిర్మాత: కంటూరు రవికుమార్ చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి. కిరణ్‌కుమార్.
ఇది చదవండి: లంబసింగి ట్రైలర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ : హరీష్ శంకర్ !!!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి