59
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువకుడు ముళ్ళపూడి అరవింద్ లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవాలని అరవింద్ లండన్ నుంచి ఇండియాకు చేరుకొని తన సొంత ఊరు అయిన అశ్వారావుపేటలో తన తొలి ఓటును వినియోగించుకున్నాడు. తల్లిదండ్రులు వద్దు అన్నప్పటికీ ఓటు విలువ తెలుసుకొని తల్లిదండ్రులను ఒప్పించి ఓటు వేసేందుకే ఇంత దూరం వచ్చినందుకు యువకుడిని పలువురు అభినందించారు. ప్రజల తలారాతను మార్చే ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అరవింద్ ప్రజలను కోరారు.
Read Also..