చిత్తూరు పట్టణం లో నవంబర్ నెలలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుల ను చిత్తూరు పోలీస్ అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 లక్షల విలువ కలిగిన 440 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూర్ పట్టణం లో సిందు టవర్స్ హోటల్ ఎదురుగా పార్క్ చేసిన కారు అద్దాలు పగులకొట్టి కారులో నుంచి కీర్తన ఫైనాన్సు కంపెనీ కి చెందిన బంగారు నగలను దొంగలించిన సంఘటనపై చిత్తూర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాలను జిల్లా ఎస్.పి. శ్రీ వై. రిశాంత్ రెడ్డి విలేకరులకు తెలియజేశారు. అనంతరం కేసు దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక రివార్డును సైతం అందజేశారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..
71
previous post