శబరిమలలో అయ్యప్పస్వామి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని గంటసేపు పొడిగించింది. ప్రస్తుతం ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90వేల బుకింగ్‌లు, స్పాట్‌లో 30వేల బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులకు సగటున 14 గంటల టైం పడుతోంది. అయితే క్యూ కాంప్లెక్స్‌లో తగిన సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, బిస్కెట్లను అందజేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్
60
previous post