రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం!

Good news for train passengers

Advertisements

&NewLine;<p>రైల్వే శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ సూపర్ యాప్‌ను డెవలప్ చేస్తోంది&period; ఈ ప్రాజెక్ట్‌కు ఇండియన్ రైల్వేస్ రూ&period;90 కోట్టు ఖర్చు చేయనుంది&period; ప్రస్తుతం అన్ని రైల్వే యాప్స్‌లో IRCTC రైల్ కనెక్ట్ అత్యంత ప్రజాదరణ పొందింది&period; ఇండియన్ రైల్వేస్ వివిధ రకాల సేవలకు కొన్ని యాప్స్ ఇప్పటికే లాంచ్ చేసింది&period; భారత్‌లో ప్రముఖ సంస్థల సేవలు కొన్నేళ్ల క్రితమే ఆన్‌లైన్‌ మోడ్‌లో అందుబాటులోకి వచ్చాయి&period; ఇప్పుడు మరింత సులభంగా సేవలను యాక్సెస్ చేసేందుకు అప్లికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు&period; ప్రయాణికులకు అన్ని సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఒక ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్‌ను రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది&period; దీని ద్వారా రైల్వే ప్రయాణికులకు యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది&period; టికెట్ బుకింగ్స్&comma; PNR స్టేటర్ చెకింగ్&comma; ట్రైన్ ట్రాకింగ్ వంlటి అన్ని రకాల రైల్వే సేవలను ఇదే యాప్‌లో అందిస్తారు&period; దీనికి తాత్కాలికంగా &OpenCurlyQuote;సూపర్ యాప్’ అని పేరు పెట్టారు&period; రైలు టికెట్ల బుకింగ్‌కు IRCTC రైల్‌ కనెక్ట్‌ యాప్&comma; జనరల్‌ టికెట్లు తీసుకోవడానికి UTS&comma; రైలు ఎక్కడుందో తెలుసుకునేందుకు &OpenCurlyQuote;నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ ఫిర్యాదులకు రైల్‌ మదద్‌ వంటి యాప్స్ ఉన్నాయి&period; దీంతో యూజర్లు సింగిల్ యాప్‌తో అన్ని సేవలను పొందవచ్చు&period; ప్రతి అవసరానికి వేర్వేరు అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు&period; ఈ సేవలను అన్నింటికీ ఇంటిగ్రేట్ చేసి సూపర్‌ యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు&period; యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు&period; ఇది ఇండియన్ రైల్వేస్ డిజిటల్ సేవల పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు&period; రైల్వేస్‌కు సంబంధించిన అన్ని సేవలను ఈ అప్లికేషన్‌తో యాక్సెస్ చేసుకోవచ్చని&comma; అవసరమైన డౌన్‌లోడ్స్‌ను ఇది తగ్గిస్తుందని సదరు అధికారి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….