ప్రభుత్వ వైద్యులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి???

Advertisements

<p>ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో మరో ఆందోళనకర పరిస్థితి వెలుగులోకి వస్తోంది&period; ప్రభుత్వ వైద్యులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి&comma; ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూనే కొందరు డాక్టర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు&comma; క్లినిక్‌లు ఏర్పాటు చేసి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; పట్టణంలోనే ఆసుపత్రి సూపరిండెంట్‌తో పాటు మరో ప్రభుత్వ వైద్యురాలు కలిసి మహిత హాస్పిటల్ పేరుతో ప్రైవేట్ వైద్యం నిర్వహిస్తూ ఓపీలు&comma; శస్త్రచికిత్సలు చేస్తూ భారీగా డబ్బులు ఆర్జిస్తున్నారని సమాచారం&period; ఇంకా ఇద్దరు వైద్యులు ఆమనగల్లు ప్రాంతంలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్&comma; విష్ణుపాలి క్లినిక్‌à°² పేరుతో ప్రైవేట్ సేవలు అందిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి&period; ఒక ఆర్థోపెడిక్ వైద్యుడు అయితే 24 గంటల ఎమర్జెన్సీ సేవల పేరుతో పెద్దఎత్తున వసూళ్లు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు&period; ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది&period; వెంటనే చర్యలు తీసుకుని నిరుపేదలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరో వైపు నియోజకవర్గంలో మరో పెద్దదైన ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి &period;&period; అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఉంది&&num;8230&semi; ఆమనగల్లు మున్సిపాలిటీకి గత ప్రభుత్వంలో 17 కోట్ల రూపాయలతో 50 పడగల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు&period;&period; రెండు సంవత్సరాలు పూర్తయిన ఇంకా ప్రారంభం కాలేదు &period;త్వరలో ప్రారంభం చేస్తామని అధికారులు అంటున్నారు&period; అయితే అన్ని మౌలిక వసతులతో పాటు &comma; అందుబాటులో ఉన్న డాక్టర్లు కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్లను కేటాయించాలని&comma; సరిపడా సిబ్బందిని నియమించి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు &period; ఇప్పటికే రేకుల షెడ్డులో కొనసాగుతున్న కమ్యూనిటీ సెంటర్ ను కొత్త భవనంలోకి మార్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు&comma; అలాగే నాసిరకం మందులు వైద్యులు అందజేస్తున్నారని వాటితో రోగం నయం కాక సతమతమవుతూ మళ్లీ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుందని &comma; కాంట్రాక్టర్లు సరైన మందులను పంపిణీ చేసేలా జిల్లా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.