మీ స్మార్ట్ ఫోన్‌ పోయిందా.? మరి మీ వాట్సాప్‌ పరిస్థితి ఏంటి.?

Smart phone

Advertisements

&NewLine;<p>స్మార్ట్ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న రోజులివీ&period; వ్యక్తిగత చాటింగ్స్‌&comma; ఫొటోలు&comma; వీడియోలు ఇలా ఎన్నింటికో వాట్సాప్‌ వేదికగా మారింది&period; మరి పొరపాటున మీ ఫోన్‌ పోతే… ఫోన్‌ తీసుకున్న వ్యక్తి మీ వాట్సాప్‌ అకౌంట్‌ను చూసే ప్రమాదం ఉంటుంది&period; అంతేకాకుండా పోయిన ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ అకౌంట్‌ను ఎలా రీస్టోర్ చేసుకోవాలి&period;&quest; వాట్సాప్‌ను సదరు ఫోన్‌లో నుంచి ఎలా డీయాక్టివేట్ చేయాలి&period;&quest; ప్రస్తుతం వాట్సాప్ వినియోగం అనివార్యంగా మారింది&period; మీ ఫోన్‌ పోయిన వెంటనే వాట్సాప్‌ను డీయాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది&period; ఇందుకోసం వాట్సాప్‌ సపోర్ట్‌కు మెయిల్ చేయాల్సి ఉంటుంది&period; ఇందుకోసం support&commat;whatsapp&period;com మెయిల్‌ ఐడీకి మీ ఫోన్‌ పోయిన విషయాన్ని వివరిస్తూ&comma; అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయమని మెయిల్ పంపించాల్సి ఉంటుంది&period; ఇందులో మీ ఫోన్‌ నెంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది&period; అయితే మీ మెయిల్ ఐడీకి కూడా అదే ఫోన్‌ నెంబర్ లింక్‌ అయి ఉండాలి&period; ఒకవేళ ఫోన్‌ పోతే చాట్ హిస్టరీ ఎలా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది&period; ఇందుకోసం కూడా ఓ ఐడియా ఉంది&period; వాట్సాప్ అకౌంట్ చాట్‌ను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటే మీ ఫోన్ పోయినా చాట్ హిస్టరీని రిస్టోర్ చేసుకోవచ్చు&period; అప్పుడప్పుడు చాట్ బ్యాకప్‌ అయ్యేలా సెట్టింగ్స్‌లో మార్చుకుంటే బ్యాకప్‌ పొందొచ్చు&period; ఇందుకోసం వాట్సాప్ సెటింగ్స్ లోకి వెళ్లి&comma; చాట్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని&comma; చాట్ బ్యాకప్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది&period; ఇక మీ ఫోన్‌ పోయిన వెంటనే మీ పాత ఫోన్‌ నెంబర్‌ను బ్లాక్‌ చేయించాలి&period; టెలికం కంపెనీ వెంటనే కొత్త సిమ్‌ కార్డును అందిస్తుంది&period; దీంతో కొత్త సిమ్‌ కార్డుతో మళ్లీ వాట్సాప్‌లోకి లాగిన్‌ అయ్యి&period;&period; చాట్‌ హిస్టరీని రీస్టోర్‌ చేసుకోవచ్చు&period; పాత ఫోన్‌ నుంచి లాగవుట్ అయ్యి&comma; కొత్త ఫోన్‌లో లాగిన్‌ అవ్వొచ్చు&period; ఒకవేళ మీ ఫోన్‌ పోతే మీ వాట్సాప్‌ అకౌంట్‌ను ఇతరులు యాక్సెస్‌ చేయకుండా ఉండాలంటే టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఎనేబుల్ చేసుకోవాలి&period; ఇందుకోసం వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి&period; అనంతరం అకౌంట్‌ సెక్షన్‌లో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ సెలక్ట్ చేసుకోవాలి&period; వెంటనే ఆరు అంకెల కోడ్ సెట్ చేసుకోవాలి&period; దీంతో వాట్సాప్‌ ఓపెన్‌ చేసిన సమయంలో పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది&period; దీంతో మీరు వాట్సాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు 6 అంకెల్‌ పిన్‌ ఎంటర్‌ చేస్తేనే వాట్సాప్‌ ఓపెన్‌ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….