Health Tips:
డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ సి, విటమిన్ బి1, బి2, బి3 వంటి పోషకాలు ఉంటాయి. మీ అందాన్ని రెట్టింపు చేయడానికి డ్రాగన్ ప్రూట్ ఎలా సహాయపడుతుంది. దీన్ని బ్యూటీ కేర్‌లో ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. ఇది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది, మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది.
ఇది చదవండి: యాలకులు తినడం వలన కలిగే లాభాలు
డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి కంటెంట్ డార్క్ స్పాట్స్, అనిఇవెన్ స్కిన్ టోన్ రూపాన్ని తగ్గించి ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. చర్మం ఉపరితలంపై బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి తోడ్పడతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని విత్తనాలు.. సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేస్తాయి. ఇవి చర్మంపై పేరుకున్న మృత కణాలను తొలగించి, మృదువైన ఛాయను ప్రోత్సహించడానికి తోడ్పడతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని సహజ చక్కెరలు, హైడ్రేటింగ్ సమ్మేళనాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని అధిక నీటి కంటెంట్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ ప్యాక్ తయారీ విధానం:
బాగా పండిన డ్రాగన్ ప్రూట్‌ను ఎంచుకోడి. డ్రాగన్ ఫ్రూట్ గుజ్జును మెత్తగా చేసి ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేయండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.