తాటి ముంజలు(Taati Munjalu):
తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, సి,ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్, పొటాషియం, ధయామిన్, రిబో ప్లేవిస్, నియాసిస్ వంటి బీ కాంప్లెక్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో మాత్రమే లభించే వీటిని ఐస్ యాపిల్స్ అని కూడా పిలుస్తారు. మూడు తాటి ముంజలు ఒక కొబ్బరి బొండంతో సమానమని నిపుణులు చెప్పుతున్నారు. తాటి ముంజలను తినటం వలన రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎండాకాలంలో మన శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో డీహైడ్రేషన్ బారిన పడతాం. అయితే అలాంటి పరిస్థితిలో తాటి ముంజలను తింటే శరీరంలోకి ద్రవాలు వచ్చి చేరతాయి. డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. వేసవిలో ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో ముంజలను తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. తాటి ముంజలలో ఉండే పొటాషియం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బరువు తగ్గాలి అంటే ఈ పండ్లు తినండి.. రిజల్ట్ పక్కా..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి