నోటి క్యాన్సర్ లక్షణాలు(mouth cancer symptoms):
నోటి క్యాన్సర్(Mouth cancer) లక్షణాలు గురించి తెలుసుకుందాం. నోటి క్యాన్సర్ మొదట నోటి లోపల లేదా పై భాగంలో పుండ్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత నోటి లోపల నాలుకపై తెల్లని మచ్చల రూపంలో పుండ్లుగా కనిపిస్తాయి. అలా నాలుకపై తెల్లని మచ్చల రూపంలో పుండ్లు కనిపించాయంటే నోటి క్యాన్సర్ గా అనుమానించాలి. క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా చెబుతారు. నోటి క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించడం కష్టంగా ఉంటుంది. నోటి క్యాన్సర్ ముదిరితే కనీసం తిండి కూడా లేని పరిస్థితి వస్తుంది. నోటి క్యాన్సర్ మొదట దంతాల చుట్టూ చిగుళ్ల వాపు లాగా వస్తుంది. దవడ చుట్టూ పుండ్లు కూడా నోటి క్యాన్సర్ కు కారణం అవుతాయి.
ఇది చదవండి: ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటున్నారా..?
నోరు శుభ్రం చేసిన తర్వాత కూడా నోటి క్యాన్సర్ ఉన్నవారికి నోరు దుర్వాసన వస్తుంది. దంతాలలో మార్పులు, దంతాల ఆకస్మిక నష్టం నోటి క్యాన్సర్ కు లక్షణాలు. ఇక నోటి క్యాన్సర్ ఎక్కువగా పొగాకు తీసుకునే వారిలో వచ్చే ప్రమాదం ఉంటుంది. సిగరెట్లు, బీడీలు, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రోగ నిరోధక శక్తి(Immunity)బలహీనంగా ఉన్న వ్యక్తులకు కూడా నోటి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి నోటికి సంబంధించి వచ్చే చిన్న చిన్న సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అవి అతి ప్రమాదకరమైన నోటి క్యాన్సర్ కు కారణమై చివరకు ప్రాణాలను తీసే ప్రమాదం ఉంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి