ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కు తప్పిన ముప్పు.

Advertisements

<p>సిరియా రాజధాని డమాస్కస్‌లో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి&period; ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆ దేశ పర్యటనలో ఉండగా&period;&period; ఆయన బస చేసిన హోటల్‌ వద్దే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి&period; అయితే&comma; ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది&period; సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరాతో సమావేశమయ్యేందుకు అధ్యక్ష భవనంలోకి మెక్రాన్‌ వెళ్లిన వెంటనే సమీపంలోని ఫోర్ సీజన్స్‌ హోటల్‌ వద్ద పేలుళ్లు సంభవించడం గమనార్హం&period; సుదీర్ఘ కాలంగా అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియా&period;&period; ఇటీవల అక్కడ పాలకులు మారిన తర్వాత పునర్నిర్మాణంపై దృష్టి సారించింది&period; పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది&period; ఈ క్రమంలోనే గతంలో పలు దేశాలు విధించిన అనేక ఆంక్షలను ఎత్తివేయడానికి పాశ్చాత్య దేశాలను ఒప్పించడంలో కీలక పాత్ర వహించిన మెక్రాన్‌&period;&period; అల్‌-à°·à°°à°¾ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆ దేశంలో కీలక పర్యటన చేపట్టారు&period; ఇందులో భాగంగా ప్రతినిధుల బృందంతో కలిసి డమాస్కస్‌లోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లోనే బస చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.