జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

Advertisements

<p>జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు&period; ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు&period; అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని&period;&period;రెండేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందని తెలిపారు&period; రెండేళ్ల తర్వాత తొలి ఏడాదిలో 100 శాతం సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు&period; మొదటి ఏడాది తర్వాత నుంచి ఈ సుంకాలు 200 శాతానికి పెంచనున్నట్లు చెప్పారు&period; ఔషధాలను దేశీయంగానే ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ట్రంప్‌&period; ఈ నిర్ణయం ద్వారా అమెరికాకు పెద్ద ఎత్తున జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే భారతీయ ఫార్మా రంగానికి రాబోయే రెండేళ్ల కాలానికి పెద్ద ఊరట లభించినట్లయింది&period;<&sol;p>&NewLine;<p>అయితే ఈ రెండేళ్ల మినహాయింపు గడువు ముగిసిన తర్వాత అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన టారిఫ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు&period; రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత వచ్చే తొలి ఏడాదిలో జనరిక్ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకం విధిస్తామని&comma; ఆ తర్వాతి ఏడాది నుంచి ఈ సుంకాలను ఏకంగా 200 శాతానికి పెంచనున్నట్లు స్పష్టం చేశారు&period; మందుల తయారీ కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించి&comma; ఔషధాలను అమెరికాలోనే దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు&period; ఫార్మా కంపెనీలు అమెరికాలోనే తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఈ రెండేళ్ల కాలాన్ని గడువుగా విధిస్తున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.