అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

Advertisements

<p>అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి&period; అయోవా రాష్ట్రంలోని మస్కటీన్ నగరంలో వరుసగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు&period; మృతుల్లో అనుమానిత నిందితుడు కూడా ఉండటం సంచలనంగా మారింది&period; కుటుంబ వివాదమే ఈ ఘటనలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు&period; 210 పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయంటూ సమాచారం అందడంతో పోలీసులు&comma; వైద్య సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు&period; అక్కడ తుపాకీ గాయాలతో నలుగురు వ్యక్తులు కనిపించగా&period;&period; వారిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు&period; ఈ ఘటనలో మస్కటీన్‌కు చెందిన ర్యాన్ విల్లీస్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు&period; అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అతడు పరారయ్యాడు&period; అనంతరం అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు&comma; మరో ప్రాంతంలో విల్లీస్ తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు గుర్తించారు&period; అదే సమయంలో మస్కటీన్‌లోని మరో నివాసంతో పాటు గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో కూడా ఇద్దరు వ్యక్తులు తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు&period; మొత్తం ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు&period;ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ అంతర్గత వివాదమే ఈ కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.